అమరావతి: గుంటూరు ఈస్ట్ టిడిపి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ దుమారం రేపుతుంది. టిడిపి నాయకురాలుతో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే నసీర్ వీడియో కాల్ నిజమేనని టిడిపి కార్యకర్త సోఫియా ఆరోపణలు చేసింది. సదరు ఎంఎల్ఎ తో మహిళ మాట్లాడిన వీడియోను తాను లీక్ చేయలేదని, నిజాలు అందరికీ తెలియాలని నాలుగు రోజుల క్రితం సెల్ఫీ వీడియో చేసి వైరల్ చేశానని సొఫియా చెప్పుకొచ్చింది. ‘నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి టిడిపి నాయకురాలు భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయాలు పోలీసులతోపాటు మరి ఎవరి దగ్గర చెప్పవద్దని ఎమ్మెల్యే నన్ను రెండు రోజుల సమయం అడిగారు’ అని సోఫియా తెలిపారు.
ఇప్పుడు ముగ్గురు ఏకమై ఈ వ్యవహారాన్ని తన మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారని పేర్కొంది. పోలీసులు, ఎంఎల్ఎ వేధించడంతోనే ఆయన ఆఫీస్ ముందు తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని సోఫియా వివరణ ఇచ్చింది. మహిళ భర్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయన్నారు. సదరు మహిళ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో మాట్లాడిన వీడియో ఆమె భర్త విడుదల చేశాడని ఆరోపణలు చేసింది. భార్యభర్తలతో పాటు మరో బంధువును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎంఎల్ఎ దగ్గరికి భార్యను భర్త తీసుకెళ్లేవాడని అతడే తనకు పలుమార్లు ఆ విషయం చెప్పాడని వివరణ ఇచ్చింది. భార్య ఫోన్ ను భర్త హ్యాక్ చేసి కాల్స్ వినడంతో పాటు రికార్డు చేశాడని, ఎంఎల్ఎతో ఆయన భార్య చనువుగా ఉన్న వీడియోలు భర్త దగ్గర చాలా ఉన్నాయని సోఫియా ఆరోపణలు చేసింది.