Thursday, July 10, 2025

తరగతి గదిలో కుప్పకూలిన లెక్కల మాస్టారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తరగతి గదిలో లెక్కలు చెబుతూ మ్యాథ్స్ టీచర్ కుప్పకూలాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్ల తంటికొండ పాఠశాలలో జరిగింది. గోకవరం గ్రామానిక చెందిన బొమ్మగంటి నాగభూషణం(56) గణిత ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నాడు. బుధవారం ఉదయం తంటికొండ జడ్‌పి ఉన్నత పాఠశాలలో పాఠాలు చెప్పటానికి వచ్చాడు. తొమ్మిదో తరగతి గదిలో విద్యార్థులకు బోర్డుపై లెక్కలు చెప్పాడు. బోర్డుపై ఉన్న లెక్కలను కాపీ చేసుకోవాలని విద్యార్థులకు సైగ చేశాడు.

వెంటనే అక్కడే కుప్పకూలిపోవడంతో సహచర ఉపాధ్యాయులు అతడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఉపాధ్యాయుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో గణిత ఉపాధ్యాయుడు మృతి చెందాడని డాక్టర్లు ఎలిపారు. నెల రోజుల క్రితమే తంటికొండ పాఠశాలకు బదిలీపై వచ్చాడు. దీంతో మృతుడు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోకవరం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News