Friday, July 25, 2025

టీచర్ల బదిలీలు ఇంకెప్పుడు?

- Advertisement -
- Advertisement -

గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు లేక ఉపాధ్యా యులు ఉన్నా విద్యార్థులు లేక అనేక పాఠశాలలు మూతపడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి, ఉపాధ్యాయు ల పోస్టులను భర్తీ చేయడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేయడం, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మౌలిక సదు పాయాలు కలిపించడం, ఎప్పుడులేని విధంగా వేసవి సెలవుల్లోనే ఉచితంగా పంపిణీ చేసే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలను సరఫరా చేయడం, పాఠశాలలలో కంప్యూటర్, ఇంటర్నెట్, ఉచితంగా కరెంటు సరఫరా చేయడంతో ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల రూపు రేఖలు మారిపోయి అనేక మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుండి ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 2025 -26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ప్రశ్నార్థకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ప్రధానోపాధ్యాయుల, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు చేయనున్నట్లు సీనియారిటీ లిస్ట్‌లను తయారు చేశారు. కొంతమంది సీనియర్ ఉపాధ్యాయులు బదిలీలు చేసి పదోన్నతులు ఇవ్వాలని కోరడంతో పదోన్నతుల విషయంలో అధికారులు డోలాయమానంలో పడ్డారు. ముందు పదోన్నతులు ఇవ్వడంతో జూనియర్‌లకు మంచి పోస్టింగ్‌లు దక్కి సీనియర్‌లకు అన్యాయం జరుగుతుందని సీనియర్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలకు నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఎలక్షన్ కోడ్ వలన ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు జరగడం అసాధ్యం అని అంటున్నారు. కేంద్రప్రభుత్వం జనగణన కోసం ఉత్తర్వులు జారీ చేయడంతో 2027 వరకు బదిలీలు, పదోన్నతులు జరగడమనేది అసంభవం అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 (ఎన్.ఇ.పి) ప్రకారం 5+3+3+4 విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుండడంతో నూతన విద్యా విధానం 2020 అమలు చేస్తే పదోన్నతులు ఏ విధంగా ఇస్తారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ అడ్జెస్ట్ మెంట్ అంటూ అదనంగా ఉన్న ఉపాధ్యాయులను జిల్లా పరిధిలో బదిలీలు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్‌లకు అధికారులు ఇవ్వడంతో బదిలీలకు బ్రేక్ పడినట్టే అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను ప్రారంభిస్తే నెల, నెల పదిహేను రోజులు పడుతుందని కొంత మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు వక్రభాష్యం చెబుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వారం రోజుల్లో పూర్తి చేయవచ్చని అంటున్నారు.

కొంత మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు కావాలనే ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ఆటంకం కలిగిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. గత పదిహేను, ఇరవై సంవత్సరాలుగా ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులు వస్తాయని ఆశపడుతున్న సమయంలో ఆటంకాలు కలిగించడం శోచనీయమని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు లేక అనేక పాఠశాలలు మూతపడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేయడం, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కలిపించడం, ఎప్పుడులేని విధంగా వేసవి సెలవుల్లోనే ఉచితంగా పంపిణీ చేసే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలను సరఫరా చేయడం, పాఠశాలలలో కంప్యూటర్, ఇంటర్నెట్, ఉచితంగా కరెంటు సరఫరా చేయడంతో ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల రూపు రేఖలు మారిపోయి అనేక మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుండి ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని జిల్లాలలో ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తి అయ్యాయి అనే బోర్డులు పెట్టిన స్థానిక నాయకుల నుండి, శాసన మండలి, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుండి ఐఎఎస్, ఐపిఎస్ ఉన్నతోన్నత అధికారుల నుండి ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం సిఫారసు లేటర్‌లు తేవడం ఫోన్‌లు చేయించడం చేస్తున్నారు.

ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు బాసర, మహబూబ్‌నగర్‌లలో గల ఐఐఐటి (త్రిపుల్ ఐటి) లలో సీట్లను కేటాయించడం, పాలిటెక్నిక్ కళాశాలలలో సీట్లను కేటాయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖలకు మంత్రులను కేటాయించి విద్యా శాఖ స్వయంగా పర్యవేక్షించడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్ లలో సమస్యలను సులభంగా గుర్తించి పరిష్కరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. గత దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి, నిర్లిప్తతకు గురైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడిన పడడంతో పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన, ఇబిసి వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో బి.సి.రెసిడెన్షియల్, ఎస్‌సి రెసిడెన్షియల్, ఎస్‌టి రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్ అంటూ ప్రయివేటు బిల్డింగ్‌లలో ప్రారంభించి విద్యార్థులకు కుల, మత పరంగా విడదీసేవారు. తెలంగాణ రేవంత్ సర్కార్ 2025- 26 విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లను సొంత భవనాలలో ప్రారంభించి కుల, మతాలకు అతీతంగా నాణ్యమైన విద్యను ఆటపాటలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభించింది. -తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో భాష (తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ) మిగతా దేశీయ భాషలను బోధించే ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటూ శ్రమ దోపిడీకి, వెట్టి చాకిరీకి గురయ్యారు.

గత ప్రభుత్వం భాష పండితులకు పదోన్నతులు ఇస్తున్నట్లు శాసన మండలి ఎన్నికలు రాగానే జిఒలు ఇవ్వటం, శాసన మండలి ఎన్నికలు పూర్తి కాగానే అటుకు ఎక్కించి మోసం చేయడం, మూడు, నాలుగు సార్లు చేసి పదోన్నతులు పదవీ విరమణ వరకు రావనే నిరాశ, నిస్పృహలకు గురి అయిన భాష పండితులకు పదోన్నతులు కల్పించి నూతన ఉత్సాహాన్ని నింపింది. గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భాష పండితుల న్యాయమైన కోరిక అయిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1/2005 ఆక్ట్ తీసుకొని వచ్చి భాషా పండితులకు అన్యాయం చేసింది. ప్రజాపాలన, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ముఖ్యంగా భాష పండితుల సమస్యలను పరిష్కరించే రేవంత్ సర్కార్ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నోషనల్‌గా ఇస్తూ 1/2005 ఆక్ట్ ను రద్దు చేసి భాష (తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ మిగతా దేశీయ భాషలు) లను బోధించే ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకంతో, ఆశతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గదర్శకాలు విడుదల చేసి జీరో సర్వీస్ కింద సర్వీస్ పరిగణించాలని, స్థానిక ఎన్నికలకు ముందే వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కోరుతున్నారు.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్
92908 26988

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News