మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ (Team India) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కెఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాహుల్(46) పెవిలియన్ చేరగా.. కొంత సమయానికే జైస్వాల్ (58) అర్థ శతకం సాధించి కొంత సమయానికే ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నిరాశ పరిచాడు. కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్.. రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో గాయపడ్డాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (61) స్టోక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ దశలో రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్‌లు తొలి రోజు ఆట ముగిసేవరకూ బ్యాటింగ్ చేశారు. రెండో రోజు 264/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. కొంత సమయానికే రవీంద్ర జడేజా(20) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శార్ధూల్ ఠాకూర్ 6వ వికెట్‌కి 48 పరుగులు జోడించాడు. శార్ధూల్(41) స్టోక్స్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో రిషబ్ పంత్ తిరిగి బ్యాటింగ్‌కి వచ్చాడు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్ చేస్తూ అర్థ శతకం సాధించాడు. కానీ, మరోవైపు సుందర్(27), అన్షుల్ కాంబోజ్(0) ఔట్ అయ్యారు. కొంత వ్యవధిలోనే పంత్(54) కూడా పెవిలియన్ చేరాడు. ఆఖరి వికెట్‌గా బుమ్రా(4) వెనుదిరిగాడు. దీంతో భారత్ (Team India) 114.1 ఓవర్లలో 358 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీశారు.