తీరుమారని టీమిండియా
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పేలవమైన (Team India batsmen failure) ప్రదర్శనతో నిరాశ పరిచారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫమయ్యారు. ఒక్క కరుణ్ నాయర్ తప్పిస్తే మిగతా వైఫల్యం చవిచూశారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌లలో బాగానే రాణించిన టీమిండియా బ్యాటర్లు ఈసారి మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయా రు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన పేలవమైన బ్యాటింగ్‌ను మరోసారి పునరావృతం చేశాడు. జట్టుకు అండగా నిలవాల్సిన యశస్వి ఈసారి రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో యశస్వి నిలకడగా రా ణించడంలో విఫలమయ్యాడు.
ఒక ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధిస్తే తర్వాతి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కు వెనుదిరగడం (Team India batsmen failure) అలవాటుగా మార్చుకున్నాడు. కీలకమైన ఐదో టెస్టులో య శస్విపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అతను మాత్రం తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యాడు. సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. జట్టుకు అండగా నిలుస్తాడని భావించిన రాహుల్ ఎక్కు వ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఓపెనర్లు రాహుల్, యశస్విలు విఫలం కావడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం కాక తప్పలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(21) సైతం విఫలమయ్యాడు.
జట్టు ను ముందుండి నడిపించలేకపోయాడు. యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా నిరాశ పరిచాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకోలేక పోయాడు. సాయి కూడా 38 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కింద టి మ్యాచ్‌లో అజేయ సెంచరీతో భారత్‌ను ఓట మి నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూ డా ఈసారి తేలిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొవడంలో జడేజా వైఫల్యం చెం దాడు. ఈసారి అతను 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా జట్టుకు అం డగా నిలువలేక పోయాడు. జురెల్ తక్కువ స్కో రుకే పెవిలియన్ చేరాడు.
అతను 19 పరుగు లు మాత్రమే చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూ డా (Team India batsmen failure) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయా డు. సుందర్ 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఖాతా తెరవడంలో విఫలమయ్యారు. కరుణ్ నాయర్ ఒక్కడే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. నాయర్ 109 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ ఐదు, జోష్ టంగ్ మూడు వికెట్లను పడగొట్టారు.