Saturday, August 2, 2025

ఓవెల్ టెస్టు.. : తన రికార్డు తానే బ్రేక్ చేసిన టీం ఇండియా

- Advertisement -
- Advertisement -

లండన్: ఓవెల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ (Team India) ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్ల ప్రతాపం ముందు మన బ్యాటర్లు తేలిపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్ చేసినప్పటికీ.. ఒక రికార్డును మాత్రం భారత్ బద్దలు కొట్టింది. ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విభాగంలో భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఆరు మ్యాచుల్లో 3270 పరుగులు చేసింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో తమ పాత రికార్డును బద్దలుకొడుతూ.. కొత్త రికార్డు సాధించింది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌ మ్యాచ్ తొలి రోజే ఈ రికార్డును ప్రస్తుత టీం ఇండియా (Team India) దాటేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో భారత్ మొత్తం 3393 పరుగులు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్ రెండో రోజు కుప్పకూలిపోయింది. రెండో రోజు తొలి గంటలోనే కేవలం 20 పరుగులు చేసి 224 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు. తొలి వికెట్‌కే 92 పరుగులు జోడించారు. లంచ్‌ బ్రేక్‌కి ముందు ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో డకెట్(43) ఔట్ కాగా.. లంచ్‌ బ్రేక్ తర్వాత ప్రశిద్ధ్ బౌలింగ్‌‌లో క్రాలీ (64) పెవిలియన్ చేరాడు. ఇక సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ పోప్(22) ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో బ్యాటర్ జో రూట్‌ని కూడా సిరాజ్ ఎల్‌బిడ్ల్యూ చేసి ఔట్ చేశాడు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజ్‌లో  బ్రూక్(8), ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News