Monday, July 7, 2025

రికార్డులు సృష్టించిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించి పలు రికార్డు సృష్టించింది.. 336 పరుగుల తేడాతో గెలుపొందింది. విదేశీ గడ్డపై ఇదే అతిపెద్ద విజయంగా టీమిండియా రికార్డు సృష్టించింది. 1967లో ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడింది, ఈ మైదానంలో 58 ఏళ్ల తరువాత గెలిచింది. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ లో 30 టెస్టు విజయాలు సాధించిన ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. 1990 లో ఒక టెస్టు మ్యాచ్ లో గ్రహమ్ గూట్ ఇండియాపై 456 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా గిల్ ఇంగ్లాండ్ పై రెండు ఇన్నింగ్స్ కలిపి 430 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడంతో పాటు 150పైకి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గిల్ రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ రికార్డుల్లోకెక్కాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టు విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలర్ ఆకాశ్ దీప్ (10/187) పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌కాగా అదే ఎడ్జ్‌బెస్టన్ చేతన్ శర్మ (10/188) వికెట్లు తీశాడు. ఒక టెస్టులో ఇంగ్లాండ్ -ఇండియా జట్లు కలిపి 1692 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News