Sunday, July 13, 2025

టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించిన టీం ఇండియా

- Advertisement -
- Advertisement -

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే టీం ఇండియా (Team India) ఆటగాళ్లు పలు రికార్డులను బద్దలుకొట్టారు. తాజాగా టీం ఇండియా జట్టుగా ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో (కనీసం మూడు మ్యాచులు) అత్యధిక సిక్సర్లు బాదిన టీంగా భారత్ చరిత్ర సృష్టించింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు నాలుగు సిక్సర్లు కొట్టింది. దీంతో ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 34 సిక్సర్లు కొట్టి.. అరుదైన ఫీట్‌ని తన సొంతం చేసుకుంది.

గతంలో ఈ రికార్డ వెస్టిండీస్, న్యూజిలాండ్ పేరిట ఉండేది. 1974లో వెస్టిండీస్ జట్టు భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 32 సిక్సులు బాదింది. ఇక కివీస్ విషయానికొస్తే.. 2014లో పాకిస్థాన్‌తో యుఎఇలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ కూడా 32 సిక్సర్లు కొట్టింది. ఇప్పుడు ఈ రికార్డును భారత్ అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. భారత్‌కు 387 పరుగులే (Team India) చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ మాత్రమే ఆడిన ఇంగ్లండ్ కేవలం 2 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News