నాలుగో టెస్టు డ్రా
2-1తో ఆదిక్యంలోనే ఇంగ్లండ్
మాంచెస్టర్: టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు డ్రా ముగిసింది. రవీంద్ర జడేజా 107 నాటౌట్ (185 బంతులు: 13×4, 1×4), వాషింగ్టన్ సుందర్ 101 నాటౌట్ (206 బంతులు: 9×4, 1×6) అజేయ శతకాలతో రాణించడంతో డ్రా చేసుకుంది. ఈ ఇద్దరూ ఐదోవికెట్ 203 పరుగులు జోడించి టీమిండియాకు ఓటమి నుంచి తప్పించారు. 174/2 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరిరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా చివరి రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రా అయినా ఈ సిరీస్‌లో ఆతిధ్య జట్టు 2-1తో ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఓవర్‌నైట్ బ్యాటర్ కెఎల్ రాహుల్ 90 (230 బంతులు: 8×4) మూడు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ స్టన్నింగ్ డెలివరీకి ఎల్‌బిగా వెనుదిరిగాడు. చివరి టెస్ట్ ఓవల్ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది.
జడేజా, సుందర్ సెంచరీలు… ఓటమి తప్పించుకున్న భారత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -