ముంబై: ప్రతిష్టాత్మక ఆసియాకప్-2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్‌లో తలపడే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను బిసిసిఐ మంగళవారం ప్రకటించింది. టీం ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించగా.. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్‌కి జట్టులో చోటు దక్కలేదు. యశస్వీ జైస్వాల్‌ని కూడా జట్టులో ఎంపిక చేయలేదు. జైస్వాల్ బదులుగా అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకుంటున్నామని.. అతను బౌలింగ్ కూడా చేయగలడు అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. అతడిని రిజర్వ్ ప్లేయర్‌గా పక్కన పెట్టారు. జైస్వాల్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్‌లను రిజర్వ్ ప్లేయర్స్‌గా ఉంచారు.
ఆసియా కప్‌లో (Asia Cup 2025) తలపడే భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్(వైస్ కెప్టెన్). సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, జితేశ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.