బర్మింగ్‌హామ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా (Team India) విజయానికి మరింత చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 427/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 72 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
ఐదు రోజు వర్షం కారణంగా ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఆరంభంలోనే.. ఆకాశ్‌దీప్ ఇంగ్లండ్‌కు షాక్ మీద షాక్ ఇచ్చాడు. 80 పరుగుల జట్టు స్కోర్ వద్ద పోప్(24)ని క్లీన్ బోల్డ్ చేసిన ఆకాశ్ ఆ తర్వాత కొంత సమయానికే బ్రూక్(23)ని ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చాడు. ఈ నేపథ్యంలో బెన్‌స్టోక్స్, జెమీ స్మిత్‌లు ఆచితూచి ఆడటం ప్రారంభించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కి కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో స్టోక్స్(33) ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 40.3 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయానికి ఇంగ్లండ్‌కు ఇంకా 455 పరుగులు అవసరం కాగా.. భారత్ (Team India) మరో నాలుగు వికెట్లు తీయాలి.