- Advertisement -
ఇంగ్లండ్‌తో లార్డ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళా క్రికెట్ టీమ్ నిర్ణీత 29 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. భారీ వర్షం వల్ల మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆశించిన స్థాయిలో స్కోరును సాధించలేక పోయింది. ఓపెనర్ స్మృతి మంధాన 5 ఫోర్లతో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 30 (నాటౌట్), హర్లీన్ డియోల్ (16), అరుధంతి (14) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ మూడు, అర్లాట్, లిన్సి స్మిత్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
- Advertisement -