టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో భారత్ (Team India) ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది భారత్ మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈసారి వన్డే, టి-20 ఫార్మాట్‌లలో టీం ఇండియా, ఇంగ్లండ్‌తో తలపడనుంది. 2026 జూలైలో ఇంగ్లండ్‌తో ఐదు టి-20లు, 3 వన్డేలు ఆడనుంది.
వచ్చే ఏడాది జూలై 1న డర్హమ్, 4న మాంచెస్టర్, 7న నాట్టింగ్‌హామ్, 9న బ్రిస్టల్, 11న సౌతాంప్టన్ వేదికలుగా టి-20లు జరుగనున్నాయి. ఇక జూలై 14వ తేదీన బర్మింగ్‌హామ్‌లో, 16న కార్డిఫ్‌లో, 19న లార్డ్స్‌లో వన్డే మ్యాచులు ఆడనుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్‌లో ఇంగ్లండ్ తమ పూర్తి షెడ్యూల్‌ని గురువారం ప్రకటించింది. భారత్‌తో (Team India) పాటు, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలతో ఇంగ్లండ్ పురుషుల జట్టు తలపడుతుంది. ఇంగ్లండ్ మహిళల జట్టు షెడ్యూల్‌ని కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. న్యూజిలాండ్, ఇండియా, ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ మహిళల జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. భారత మహిళలతో మే 28న చెల్మ్స్‌ఫోర్డ్, మే 30న బ్రిస్టల్, జూన్ 2 టౌంటన్‌లో మూడు టి-20లు, జూలై 10-14 వరకూ లార్డ్స్‌లో ఓ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు ఆడనుంది.