336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
ఎడ్జ్‌బాస్టన్: తొలి టెస్టులో పరాజయానికి టీమిండియా ప్రతికారం తీర్చుకుంది. అనుభవంలేని కుర్రాళ్లంతా కలిసి ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. యంగ్ బౌలర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ధాటికి ఆతిధ్య జట్టు భారీ ఓటమిని మూటగ్టుకుంది. ఎడ్‌జబాస్టన్‌లో సగర్వంగా తొలి గెలుపును నమోదు చేసి చరిత్ర పుటలకు ఎక్కింది టీమిండియా. భారీ లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టును 271 పరుగులకే ఆలౌట్ చేసి, ౩36 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా. అంతేకాదు.. పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద విజయం.
అంతకుముందు 279 పరుగుల విజయం 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో సాధించింది. ఇక భారత్ తరుఫున సారథి శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించి శతకం బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు, ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డీ విడిచాడు. దీంతో ఇంగ్లండ్ 271 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జేమీ స్మిత్(88) ఒక్కడే పోరాడాడు. బ్రైడన్ కార్స్(38), బెన్ స్టోక్స్(33), ఓలీ పోప్(24), హ్యారీ బ్రూక్(23), పరుగులు చేశారు. ఇక 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరుజట్టు 1-1తో సమంగా నిలిచాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్..
టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి, అన్ని వికెట్లు కోల్పోయి 587 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శన చేశాడు. 269 పరుగుల డబుల్ సెంచరీని సాధించాడు. శుభ్‌మన్ గిల్‌తో పాటు కెఎల్ రాహుల్(55), రిషబ్ పంత్ (65), రవీంద్ర జడేజా(69) కూడా అర్థ శతకాలతో రాణించారు. తద్వారా జట్టు స్కోరు 500 దాటింది. అనంరతం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్(158), జేమీ స్మిత్(184) సెంచరీలు సాధించి జట్టును కష్టం నుంచి బయటపడేయడానికి ప్రయత్నించారు. కాగా, మిగతావారెవరూ రాణించకపోవడంతో 407 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. దీంతో టీమిండియా 180 భారీ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్ శతకం..
180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లోనూ సారథి శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగి ఆడాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 161 పరుగులు చేశాడు. గిల్ 162 బంతుల్లో 13 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో న్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ఓ దశలో ఈ ఇన్నింగ్స్‌లోనూ గిల్ డబుల్ సెంచరీ చేస్తాడని అనుకుంన్నారంతా. గిల్‌కు తోడు కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్, జడేజా పరుగులు చేసి భారత్ స్కోరును వేగంగా ముందుకు నడిపించారు. యశస్వి జైస్వాల్ 28, కరుణ్ నాయర్ 26 పరుగుల ప్రారంభాన్ని అందించారు. నితీష్ కుమార్ రెడ్డి 1 పరుగు చేయగా, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు చేశాడు. దీంతో భారత్ 608 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది.