Monday, June 9, 2025

అదుర్స్ అనిపించేలా ‘అఖండ-2 టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ-2’ (Akhanda-2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్, బాలకృష్ణ చెప్పిన డైలగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా టీజర్‌లో ఫైట్స్‌ సీన్స్ చూస్తే.. అభిమానులకు పూనకాలు రావాల్సిందే. ఇక దీంతో పాటు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారని టాక్. 14 రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News