- Advertisement -
అమరావతి: పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చేవరకు మన తోనే ఉంటానని చంద్రబాబు చెప్పారు. కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారు ఎంతో మంది ఉన్నారని, సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలమని తెలియజేశారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చామని, మనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టెక్నాలజీ సరిగా వాడుకుంటే మనం ముందుకెళ్లగలమన్నారు. మన భూముల్లో ఏయే పంటల పండుతాయో తెలుసుకునే టెక్నాలజీ వచ్చిందని, నేరాలు చేసి ఎవరూ తప్పించుకోలేరని, సిసి కెమెరాలు, డ్రోన్లు ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
- Advertisement -