మన తెలంగాణ/బోడుప్పల్/సిటిబ్యూరో : తీ న్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కా ర్యాలయంపై దాడి కేసులో గన్‌మెన్ల వ్యవహార తీరుపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బా బు సీరియస్‌గా పరిగణించారు. ఎమ్బెల్సీ చింతపండు నవీన్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చే సిన జాగృతి కార్యకర్తలు ఆదివారం ఫిర్జాదీగూడలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చే శారు. ఈ సమయంలో జాగృతి కార్యకర్తలు మల్లన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో గన్‌మెన్లు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కా ల్పుల్లో జాగృతి కార్యకర్త సాయికి గాయాలు కా వడంతో చికిత్స పొందుతున్నాడు. వెంటనే సం ఘటన స్థలాన్ని పరిశీలించిన మల్కాజ్‌గిరి డిసిపి పద్మజ, ఎసిపి చక్రపాణి పరిశీలించి రాచకొండ పోలీస్ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ‘
విచారణలో గన్‌మెన్లు ఎమ్మెల్సీ మల్లన్న గనెమెన్లు కాల్పులు జరపమని చెప్పడంతో ముందు జాగ్రత్తగా కాల్పులు జరిపామని చెప్పడంపై రాచకొం డ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సీరియస్‌గా పరిగణించారు. గన్‌మెన్లు గాలిలోకి కాల్పులు జరిపి తర్వాత నేరుగా అక్కడికి వచ్చిన వారిపై కాల్పులు జరపడంపై సీరియస్ అయ్యారు. వెంటనే ఇద్దరు గన్‌మెన్లను రాచకొండ కమిషనర్ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలపై బిఎన్‌ఎస్ 191(2), 191(3), 333, 109, 324(4), 351(3), 132, రెడ్‌విత్ 190, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న ఆయన కార్యాల సిబ్బంది కత్తులతో దాడ చేశారని జాగృతి కార్యకర్త అశోక్ యాదవ్ ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న, ఆయన సిబ్బందిపై పోలీసులు 191(2), 191(3), 76,127(2), 109,351(3), రెడ్‌విత్ బిఎన్‌ఎస్ 190 కింద కేసు నమోదు చేశారు.