సూపర్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
తల్లి ఆశయం కోసం…
ఈ సినిమాలో నేను ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం ప్రయాణించే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. -ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, తనకి యోధులుకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి తను ఎంత దూరం వెళ్తాడు? తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్తాడు? అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
అదొక్కటే గుర్తొస్తుంటుంది…
‘మిరాయ్’లో మొత్తం దాదాపు 9 యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే చాలెంజ్. ఎన్ని రిస్కులు, ఛాలెంజ్‌లు తీసుకున్న సరే.. ఆడియన్స్ రిలీజ్ రోజు ఎంత థ్రిల్ అవుతారు… అదొక్కటే గుర్తొస్తుంటుంది.
మైనస్ 80 డిగ్రీలలో పని చేశారు
శ్రియా, జగపతిబాబులతో నేను చిన్నప్పుడు కలిసి నటించాను. వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు కలిసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. జగపతిబాబు, శ్రియా, జయరాం చాలా పెద్ద నటులు. మాతో పాటు హిమాలయాలు, నేపాల్, శ్రీలంకతో పాటు మైనస్ 80 డిగ్రీలలో కూడా పని చేశారు. మా సినిమా కోసం అంత కష్టపడినందుకు వారికి కృతజ్ఞతలు.
మనోజ్ అద్భుతంగా నటించారు…
మనోజ్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర అది. ఒక పెద్ద అపాయాన్ని సృష్టించగల క్యారెక్టర్ అది. హీరో ఎలా ఎదుర్కోగలడు అనిపించేలా ఉండే క్యారెక్టర్. అలాంటి గొప్ప క్యారెక్టర్‌లో మనోజ్ అద్భుతంగా నటించారు.
చాలా ఆనందాన్నిచ్చింది…
ట్రైలర్ విడుదలైన తర్వాత చిరంజీవి ఒక పెద్ద మెసేజ్ పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే నాని అన్న కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు. చాలామంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి…
మన ఇతిహాసాలతో మిళితమైన కథ ఇది. మిరాయ్‌లో శ్రీరాముల వారి నేపథ్యం ఉంటుంది. అది చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ, వచ్చినప్పుడు ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.
అందరికీ నచ్చే సినిమా…
మిరాయ్ ప్రారంభం నుంచి చివరి వరకు యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, ఎమోషన్, ఆధ్యాత్మిక అంశాలు అన్నీ ఉంటాయి. అందరికీ నచ్చే సినిమా ఇదవుతుంది. ఇక ప్రస్తుతానికి నేను ‘జాంబిరెడ్డి 2’ ఒక్కటే కమిట్ అయ్యాను.
Also Read: ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’.. #OG విలన్ పవర్‌ఫుల్ సాంగ్ రిలీజ్