Monday, September 8, 2025

వ్యవసాయ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా భావిస్తుంది: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తలసరి ఆదాయంలో, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. కర్ణాటక, హరియాణాను అధిగమించి తెలంగాణ రికార్డు సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల సమావేశంలో భట్టి మీడియాతో మాట్లాడారు. వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్లోనే 33.64 శాతం వృద్ధి సాధించిందని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.

ఆస్తుల తాకట్టు, ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయండని రైతులను ఒత్తిడి చేయవద్దని అన్నారు. వ్యవసాయ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా తెలంగాణ భావిస్తుందని తెలియజేశారు. రైతుల పక్షాన రుణమాఫీ, రైతు భరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేశామని, రూ.30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని భట్టి విక్రమార్క ప్రశంసించారు.

Also Read : రాజకీయ కక్ష ఉంటే మాపై తీర్చుకోవాలి… రైతులపై కాదు : పొన్నం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News