Friday, May 23, 2025

రాష్ట్రానికి 10.26టిఎంసిల కృష్ణా జలాలు

- Advertisement -
- Advertisement -

కెఆర్‌ఎంబి నిర్ణయం వేసవి
అవసరాలు తీర్చేందుకు
నీటి కేటాయింపు ఎపికి
నాలుగు టిఎంసిలు

మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి నీటి అవసరాల దృష్టా శ్రీశైలం, నాగార్జనసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేయనున్నారు. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు త్రిమెన్ కమిటి నిర్ణయంపై గురువారం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలంలో 800 అడుగులు, నాగార్జునసాగర్‌లో 505 అడుగుల వరకు నీటిని వినియోగిచుకోవచ్చని తెలిపిది. ఏపి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణ యం తీసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టులో జులై నెలాఖరు నాటికి 800 అ డుగల కనీస నీటి మట్టం కొనసాగించాలని ఉత్తర్వులో పేర్కొంది. వేసవి తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు కేఆర్‌ఎంబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టులలో నీటిమట్టాలపై కూడా బోర్డు స్పష్టతనిచ్చింది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అనుమతించింది. ఈ నీటి విడుదలతో వేసవిలో తాగునీటి సమస్య కొంతమేర తీరుతుందని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో కూడా బోర్డు కీలకమైన సూచన చేసింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం జలాశయంలో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తాయని కెఆర్‌ఎంబి ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News