- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ నెంబర్ 27 పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొరోగ్ చేయడం వల్ల అసెంబ్లీ సమావేశాలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ప్రొరోగ్ తరువాత అసెంబ్లీని తిరిగి సమావేశపరచడానికి కొత్త నోటిఫికేషన్ అవసరం ఉంటుంది. ప్రభుత్వం కొత్త సమావేశాల తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపడంతో దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు అనుగుణంగా అసెంబ్లీ ప్రొరోగ్ చేశారు. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేస్తారు. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది.
- Advertisement -