Sunday, May 18, 2025

నెలాఖరులో విస్తరణ

- Advertisement -
- Advertisement -

మంత్రుల కూర్పుపై ఓ అంచనాకు వచ్చిన
అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు ఉండదు
బిఆర్‌ఎస్ పని అయిపోయింది అగ్రనాయకుల్లో
తారస్థాయిలో విభేదాలు సోషల్ మీడియాపై
మధ్యప్రదేశ్ తరహా చట్టం తెస్తాం నెలాఖరులో
పూర్తిస్థాయి పిసిసి కార్యవర్గం నిజామాబాద్‌లో
పిసిసి సారథి మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో :రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet expansion) ఈనెల చివరలో లేదా జూన్‌లో ఉండవచ్చని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనప్రాయంగా తెలిపారు. నిజామాబాద్ లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవి ఆశించేవారు ఎక్కువగా మంది ఉన్నారని, కానీ ఖాళీలు తక్కువగా ఉ న్నాయన్నారు. విస్తరణపై అధిష్టానం ఓ అంచనా కు వచ్చిందని అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తనను కేవలం సలహాలు, సూచనలు మాత్రమే అడుగుతారని చెప్పారు. గతంలో మంత్రివర్గ విస్తరణపై తనను సలహాలు అడిగితే ఇచ్చామని స్పష్టం చేశా రు. తుది నిర్ణయం మాత్రం పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున కేబినెట్ విస్తరణ జరిగితే బాగుంటుందని అభిప్రా యపడ్డారు.

సిఎం మార్పు అంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం (Telangana Cabinet expansion) చేస్తున్నాయని, అసలు ముఖ్యమంత్రి మార్పు అవసరమే లేదని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి అనేక బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, యువకుడైన రేవంత్ సమర్థవంతమైన పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ లు అమలు చేయడం మీదే ఫోకస్ పెట్టారని అన్నా రు. అయినా కాంగ్రెస్ వ్యవహారాల గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.బిఆర్‌యస్ పని అయిపోయిందని, కెసిఆర్, కవిత, హరీశ్, కెటిఆర్ మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అందుకే కెసిఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని అన్నారు. గతంలో బిఆర్‌ఎస్ మంత్రుల వ్యవహారశైలి గురించి ఆమె ప్రస్తావించారని గుర్తు చేశారు. అయితే, దీనిని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని, వారిపై సైబ్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సోషల్ మీడియాపై తెలంగాణలోనూ మధ్యప్రదేశ్ తరహా చట్టం తెస్తామన్నారు. ఈ నెలాఖరులో పూర్తి స్థాయిలో పిసిసి కార్యవర్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడేళ్లు దాటిన చోట్ల జిల్లా అధ్యక్షులను మారుస్తామని స్పష్టం చేశారు. పిసిసి కార్యవర్గంలో సమర్థులైన వారికే చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News