Thursday, September 11, 2025

నేడు కెబినేట్ విస్తరణ.. ఈ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు తెలంగాణ కెబినెట్ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నేడు ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆరుగురు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు హడావుడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం గవర్నర్ హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా.. డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్ ప్రమాణం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News