Friday, August 22, 2025

ఈనెల 25న తెలంగాణ కేబినెట్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కేబినెట్ ఈనెల 25వ తేదీన సమావేశం జరగనుంది. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో కేబినెట్ జరుగనుంది. ఈ భేటీలో భాగంగా స్థానిక ఎన్నికలపై చర్చించడం, బిసి రిజర్వేషన్‌ల గురించి నిర్ణయం తీసుకోవడంతో పాటు నేడు జరిగే పిఏసి సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై కేబినెట్‌లో చర్చించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. కాళేశ్వరం నివేదికపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఇటీవల హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన అనంతరం చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ఈ భేటీలో తేదీలను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News