Saturday, July 26, 2025

నేడు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర మం త్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నా లుగు గంటలకు సచివాలయంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్నది. రెం డు రోజుల ఢిల్లీ పర్యటనల అంశాలు మంత్రివర్గంలో చర్చకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వే పై కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన నేపధ్యంలో మంత్రివర్గంలోని బిసి మం త్రులు సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. బిసి రిజర్వేషన్లపై ఎక్స్‌పర్ట్ క మిటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించనున్నది. దీన్ని మంత్రివ ర్గం ఆమోదించాక శాసనసభ సభలో ప్రభు త్వం చర్చకు పెట్టనున్నది.

హైకోర్టు ఆదేశాల కు లోబడి సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సం స్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో బిసి రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఏవిధం గా ముందుకు సాగాలనే అంశంపై ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు దిశనిర్దేశనం చేయనున్నారు. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భా రీ వర్షాలు, పంటల సాగుఇబ్బందులు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి వంటి కార్యక్రమాలు అమలు తీరుతెన్నులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News