- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని.. రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనాభ లెక్కలతో పాటు కులగణన కూడా చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ స్వాగతించారు. కులగణనకు నిర్ణీత సమయం తెలపాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో చేసిన కులగణన బ్లూప్రింట్‌గా, దేశానికి మోడల్‌గా ఉంటుందని అన్నారు. కులగణన అనేది కేవలం తొలి మెట్టు మాత్రమే అని.. ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు.
- Advertisement -