Tuesday, September 16, 2025

నేడు తెలంగాణ దశాబ్ది వేడుకలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు(జూన్ 2) తెలంగాణ దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి కావడంతో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరుల స్తూపం దగ్గర నివాళి అర్పించనున్నారు.  ఆ తర్వాత ఉదయం 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయజెండా ఆవిష్కరిస్తారు.

ఇక, సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై దాదాపు 5 వేల మంది కళాకారుల ధూం ధాం ప్రదర్శనలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్నారు. అనంతరం రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News