Sunday, June 15, 2025

హాలీవుడ్‌ను తీసుకురండి

- Advertisement -
- Advertisement -

ఐటి, ఫార్మా పరిశ్రమలకు ఇచ్చినట్లే ప్రోత్సాహకాలు ఇస్తాం హాలీవుడ్‌ను, బాలీవుడ్‌ను
హైదరాబాద్‌కు తీసుకురండి సినీ పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తుంది పైకి కఠినంగా
కనిపిస్తున్నా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడమే మా అభిమతం గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో
సిఎం రేవంత్‌రెడ్డి హీరో అల్లు అర్జున్‌కు స్వయంగా షేక్‌హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: హాలీవుడ్ అంటే అమెరికా, బాలీవుడ్ అంటే ముంబై అనే పరిస్థితిని ఇక నుంచి మర్చిపోయి.. అ సలు సినిమా అంటేనే హైదరాబాద్ అనే స్థాయికి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమం త్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. దీనికి ద ర్శకుడు రాజమౌళి బాధ్యత తీసుకోవాలని కోరారు. భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అని సిఎం వ్యాఖ్యానించారు. ప్రపంచం గర్వించే స్థాయికి తె లుగు సినిమా ఎదిగిందని ప్రశంసించారు. అలాంటి తెలుగు సినిమాకు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటే శ్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు వారి వారి స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని పెంచారని చెప్పా రు. సినిమా పరిశ్రమను కాంగ్రెస్ ప్రభు త్వం ఎప్పుడూ గౌరవిస్తుందని, ఏం కావాలన్నా ఇస్తామని అన్నారు. తెలంగాణ గద్ద ర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హై టెక్స్‌లో ఘనంగా జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ము ఖ్య అతిథులుగా హాజరై అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,ఎఫ్‌డిసి చై ర్మన్, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డిసి ఎండి హ రీష్ జ్యోతి, సినీ ప్రముఖులు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ దేవరకొండ, నాగ్ అశ్విన్, సుకుమార్, మణిరత్నం, సుహాసిని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భం గా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, గద్దర్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు అం దరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చె ప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమ ను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని, ఆ అనవాయి తీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిందని అన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే అని చెప్పారు.

ఎక్కువ తక్కువ అనే తేడాలు లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఈ సందర్భంగా సినీ ప్రముఖులకు సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాను మరో 22 ఏండ్లు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, సినీ పరిశ్రమకు ఏం కావాలో తనకు చెబితే ఇస్తానని అన్నారు.తాను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని, ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుందని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్ర ఏకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తామని తెలిపారు.

గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క
గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గద్దరన్న తమకు ఒక స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. తెలిపారు. గద్దర్ అంటే చైతన్యం, గద్దర్ అంటే విప్లవం, గద్దర్ అంటే మార్పు అని, ఆయన స్ఫూర్తితోనే తాము పోరాటాలు చేశామని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడానికి తాము గర్వంగా ఫీలవుతున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సినీ పెద్దల అందరి సహకారం ఉండాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుందని చెప్పారు. సినీ అవార్డులు ఇస్తే బాగుందని నిర్మాత దిల్ రాజు ముందుగా ప్రతిపాదించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి విడుదలైన అన్ని సినిమాలకు అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన అందరికీ సిఎం ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News