Thursday, July 31, 2025

అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు’(టిజిఎఫ్‌ఎ) అందజేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చలన చిత్ర అవార్డులను అందించడం విశేషం.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మెన్ దిల్ రాజు, ఎఫ్‌డిసి ఎండీ హరీశ్ కలిసి ఈ వేడుకను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి) గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు.

అదేవిధంగా నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, దర్శకుడు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, దర్శకుడు సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు, నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు, నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు సాంకేతిక నిపుణులకు అవార్డులతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ వేడుకలో సుహాసిని, మురళీ మోహన్, జయసుధ, జయప్రద, రాజమౌళి, పూజా హెగ్డే, ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి తదితరులు సందడిచేశారు.

అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది
గద్దర్ అవార్డుల్లో భాగంగా ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ అందుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఈ అవార్డులను ప్రదానం చేయడం సంతోషం. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అవార్డును ప్రారంభించారు. చాలా మంది ఈ అవార్డులు అందుకున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డును ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు అవార్డు ద్వారా ఇచ్చిన నగదును బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు ఇచ్చినట్టే. ఎన్టీఆర్ బిడ్డని అయినందుకు, అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది”అని తెలిపారు.

సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు
ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డు (Gaddar Film Award) ను అందుకున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నాకు ఈ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డును అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు. ఐ లవ్ యూ సుకుమార్. ఈ అవార్డు నిజంగా సుకుమార్ విజన్. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ రాజమౌళికి చెప్పాలి. ఆయనే కనుక పుష్ప 1ను హిందీలో రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు. రాజమౌళికి థ్యాంక్స్ చెప్పడానికి ఇలాంటి వేడుక కోసమే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డ్. ఎందుకంటే పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి, ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి ఏడాది ఈ వేడుక దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

2024 సంవత్సరానికి గద్దర్ అవార్డులు అందుకున్నవారు.. ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ మొదటి చిత్రం – కల్కి
ఉత్తమ ద్వితీయ చిత్రం – పొట్టేల్
ఉత్తమ తృతీయ చిత్రం – లక్కీభాస్కర్
ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ హాస్యనటుడు – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్ (రజాకార్)
ఉత్తమ స్టోరీ రైటర్ – శివ పాలడుగు
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)
ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి)
ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకంః మన సినిమా ఫస్ట్ రీల్
(రెంటాల జయదేవ్ )
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ – యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు
ఉత్తమ చారిత్రక చిత్రం – రజాకార్
స్పెషల్ జ్యూరీ అవార్డులు
నటుడు- దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)
నటి- అనన్య నాగళ్ల (పొట్టేల్)
దర్శకులు- సుజీత్, సందీప్ (క)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News