హైదరాబాద్: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు (Rahul Sipligunj) రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. బోనాల సందర్భంగా అతడికి రూ.కోటి పురస్కారం అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు ముందే రాహుల్‌కు రూ.10 లక్షలు అర్థిక సహాయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.కోటి పురస్కారం ఇస్తామని రేవంత్ అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్‌కు ప్రభుత్వం నజరానా ఇచ్చింది.
స్వయంకృషితో ఎదిగిన రాహుల్ (Rahul Sipligunj) యువతకు మార్గదర్శకుడు అని సిఎం రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. రాహుల్ తొలుత ర్యాప్ సాంగ్స్ పాడుతూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. యూట్యూబ్‌లో అతడు విడుదల చేసిన పలు ప్రైవేటు సాంగ్స్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. 2009లో వచ్చిన జోష్ సినిమాలో ‘కాలేజీ బుల్లోడా’ అనే పాటతో రాహుల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీరవాణి మ్యూజిక్‌లో రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.