Saturday, May 3, 2025

అక్రమాస్తుల కేసులో అరెస్ట్.. ఈఎన్సీ హరిరాంను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈఎన్‌సి హరిరాంను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గత బిఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సిగా పనిచేసిన హరిరాం నాయక్ భారీగా ఆస్తులు కూడా బెట్టినట్లు ఎసిబి అధికారులకు తెలియడంతో సోదాలు నిర్వహించారు. గత శనివారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసంతోపాటు పలు ప్రాంతాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించి అక్రమాస్తులను గుర్తించిన అధికారులు అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు హరిరాం నాయక్‌కు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News