Wednesday, August 27, 2025

మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.344కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చె ప్పిన మేరకు మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను వి డుదల చేసింది. ఈ మేరకు సెర్ప్‌కు ఆర్థిక శాఖ శుక్రవారం నిధులు విడుదల చేసింది. దీనిలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకు మ హిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని తెలిపారు.

ఇందుకుసంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు సైతం ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వివరించారు. బిఆర్‌ఎస్ హయంలో వడ్డీలేని రుణాలు నిలిచిపోయాయని తెలిపారు. రూ.3000 కోట్లకు పైగా బిఆర్‌ఎస్ సర్కార్ బకాయిలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సకాలంలో వడ్డీలేని రుణాల చెల్లింపు జరుగుతోందని తెలిపారు. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News