Friday, May 30, 2025

రైతన్నకు రాష్ట్ర సర్కార్ చేయూత

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుసార్లు వచ్చిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబందించిన 51,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. పంట నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు పరిహారం కింద రూ.51,528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పంట నష్టం కింద మంజూరైన నిధులను త్వరలోనే రైతుల బ్యాంకు అంకౌట్లలో నేరుగా ప్రభుత్వం జమచేయనున్నది. గత రెండు నెలలుగా అకాల వర్షాల కారణంగా జరిగిన పంటనష్టాన్ని అంచనావేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖను ఆదేశించారు.

దాంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పరిస్థితులను సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా పంటనష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లాలో యంత్రాంగం సమష్టిగా రైతువారీగా జరిగిన పంటనష్టం అంచనాలు రూపొందించారు. దానిని నివేదిక రూపంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి అందజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 29 జిల్లాల్లో పంట నష్టం వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రకటించారు.

పంట నష్టం వివరాలు
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంటనష్టం వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. 29 జిల్లా పరిధిలో వరి పంట 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4,753 ఎకరాలు, ప్రాణహిత వరదల కారణంగా ఇతర పంటలు 477 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అంధికారులు అంచనావేశారు. దీని ఆధారంగా రాష్ట్రంలో 51,528 ఎకరాల్లో పంట నష్ంటం అంచనా వేసి పరిహారం కింద రూ.50,528 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.

29 జిల్లాల్లో పంటనష్టం జరిగిన రైతుల సంఖ్య, పరిహారం వివరాలు
క్రమ సంఖ్య జిల్లా రైతుల సంఖ్య పరిహారం(రూ.కోట్లల్లో)
1 సిద్దిపేట 4,913 6.141
2 ములుగు 2,933 5.727
3 జగిత్యాల 5,099 5.453
4 మంచిర్యాల 3,017 4.597
5 మహబూబ్‌నగర్ 3,888 4.003
6 పెద్దపల్లి 3,297 3.567
7 మహబూబాబాద్ 3,097 3.519
8 జనగామ 2,160 3.364
9 నిజామాబాద్ 1,512 1.674
10 సిరిసిల్లా 1,449 1.671
11 యాదాద్రి 1,168 1.631
12 నాగర్ కర్నూల్ 1,034 1.588
13 మెదక్ 1,313 1.144
14 సూర్యాపేట 662 1.104
15 వనపర్తి 888 0.877
16 వికారాబాద్ 912 0.764
17 నల్లగొండ 710 0.759
18 కామారెడ్డి 879 0.740
19 ఆసిఫాబాద్ 412 0.609
20 రంగారెడ్డి 413 0.563
21 నారాయణపేట్ 354 0.520
22 ఖమ్మం 299 0.474
23 సంగారెడ్డి 334 0.421
24 ఆదిలాబాద్ 234 0.246
25 కరీంనగర్ 193 0.146
26 నిర్మల్ 127 0.128
27 కొత్తగూడెం 36 0.050
28 వరంగల్ 24 0.043
మొత్తం 41,361 51.528

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News