Saturday, August 23, 2025

కాళేశ్వరం నివేదికపై స్టే ఇవ్వలేం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం నివేదిక ర ద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మాజీసిఎం కెసి ఆర్, మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై మ ధ్యంతర ఉత్తర్వుల జారీకి ధ ర్మాసనం నిరాకరించింది. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకో ర్టు ఆదేశిస్తూ, తదుప రి విచారణను నాలు గు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం  ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మానం విచారణ చేపట్టింది. పిటిషనర్లు కోరిన విధంగా స్టే మాత్రం ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కెసిఆర్, హరీష్‌రావవుకు హైకోర్టులో నిరాశ ఎ దురైంది.కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు శుక్రవారం తెలియజేశారు.

కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా కోర్టుకు తెలిపారు. హరీష్ రావు తరఫు న్యాయవాది సుందరం జోక్యం చేసుకుంటూ, కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌దార్లపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని కోరారు. అంతేకాకుండా జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందే మీడియాకు ఇచ్చి తమ పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని ఆయన కోర్టుకు తెలిపారు. అలాగే తమ పిటిషన్‌దారులకు 8బి, 8సి కింద నోటీసు ఇవ్వలేదని గుర్తు చేసారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తులు జోక్యం చేసుకుని 8బి నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) ఎందుకు ఇచ్చారని ప్రభుత్వ తరఫు వాదనలు వినిపించిన ఏజీని సూటీగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటీస్ 8బి లాంటి నోటీసేని ఏజీ వివరించారు. కెసిఆర్, హరీశ్‌రావు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని, ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ నివేదిక ప్రవేశపెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఏజీ వెల్లడించారు. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి ఆరు నెలలు గడువు ఉంటుందని ఏజీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News