Tuesday, June 24, 2025

ఏడాదిన్నర అవుతున్నా.. ఏం చేస్తున్నారు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హై కో ర్టు తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలోని సర్పంచ్‌ల పదవీ కాలం జనవరి 31, 2024వ తేదీన ముగిసింది. నాటి నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధన మేరకు నల్గొండ, ని ర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ మాదవిదేవి వి చారణ చేపట్టారు. గత డిసెంబర్‌లో జరిగిన విచారణలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తేదీలు వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ల త రపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పంచాయతీలకు పాలక వర్గం లే కుండా ఉండవద్దని సుప్రీం కోర్టు తీర్పులు చెపుతున్నట్లు వారు కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం ఎన్నికలైనా నిర్వహించండి, లేదా పాత సర్పంచులనే కొనసాగించాలని పిటిషనర్లు తమ వాదనను వినిపించారు. దీనిపై రా ష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించగా, పంచాయతీల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర అవుతున్నా ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపిందని మరి ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో కులగణన సర్వే కారణంగా జాప్యం జరిగిందని, మరో 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వం తరపున న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపకుండా ఏం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం తమ ప్రక్రియను పూర్తి చేస్తే ఎన్నికల నిర్వహణ చేపడతామని స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించడానికి 60 రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News