- Advertisement -
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై నమోదైన కేసులను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. గతేడాది పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా కెటిఆర్ తమ పేరు ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో నల్గొండలో వేరువేరు పోలీస్ స్టేషన్‌లలో కెటిఆర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ కెటిఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. రాజీయ కక్షలలో భాగంగా కేసు నమోదు చేశారని కెటిఆర్ తరపు న్యాయవాది రమణారావు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కెటిఆర్‌పై నమోదయిన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -