Saturday, July 12, 2025

ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురయింది. ఫీజులు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటికి(టిఎఎఫ్‌ఆర్‌సి) ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ఫీజుల పెంచడాన్ని ప్రభుత్వ నిరాకరణను సవాల్ చేస్తూ సుమారు 11 ఇంజనీరింగ్ కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం ప్రైవేటు కళాశాలల పిటిషన్లు కొట్టివేసింది. మూడేళ్లకోసారి కళాశాలలను పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోలేదని, 15మంది సభ్యులు ఉన్న కమిటీ నిర్ణయంలో జాప్యమెందుకని కోర్టు టిఎఎఫ్‌ఆర్‌సిని ప్రశ్నించింది. దీంతో పాటు టిఎఎఫ్‌ఆర్‌సిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, కౌన్సిలింగ్ పూర్తయ్యాక పిటిషన్‌లు వేయడం ఏమిటని కళాశాలలను సైతం ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News