Thursday, August 14, 2025

పెద్దమ్మ గుడి కూల్చివేతపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పెద్దమ్మ గుడి కూల్చివేతపై గురువారం హైకోర్టు ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాని ఆదేశించింది. పెద్దమ్మ గుడి కూల్చివేతపై లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మిచాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం విగ్రహాన్ని భద్రపరిచి కూల్చివేతలకు గల ఆధారాలను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకు వాయిదా వేసింది. కాగా, పెద్దమ్మ గుడి కూల్చివేతపై కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. కూల్చివేతకు నిరసనగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News