Thursday, May 22, 2025

దేశానికి ఆదర్శంగా తెలంగాణ:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. 2015లో తలసరి జీఎస్‌వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్‌ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిందని చెప్పారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తలసరి ఆదాయం రూ. 1.25 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు రెట్టింపు కాగా 6.8 శాతం సీఏజీఆర్‌తో ఈ పురోగతి సాధ్యమైందన్నారు. ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు,

బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయని, ఇది సమర్థవంతమైన పాలన, ధీటైన ఆర్థిక వ్యూహాలతో తెలంగాణను దేశంలో అభివృద్ధి చిహ్నంగా నిలిపిన సాక్ష్యం అన్నారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చిత్రీకరిస్తూ వస్తున్నారని, వాస్తవంగా దివాలా అయింది ఆర్థిక వ్యవస్థ కాదు, ఆయన ఆలోచనలే అని, ఈ నిరూపిత విజయాలను విస్మరించి, బీఆర్‌ఎస్ వేసిన బలమైన పునాదిని కొనసాగించకపోవడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే కాదు, తెలంగాణ ప్రగతిని అవమానించడమేనన్నారు. బీఆర్‌ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News