- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి విముక్తి కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరో 12గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ద్రోణి అనేది రాబోయే 36గంటల్లో వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా నైరుతి రుతుపవనాలు కూడా క్రీయాశిలకంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురువనున్నాయి. ఇందులో కోస్తాంధ్ర, తెలంగాణాల్లో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
- Advertisement -