Wednesday, May 21, 2025

రాజ్‌భవన్‌కు మార్ఫింగ్ మరక

- Advertisement -
- Advertisement -

మహిళా ఉద్యోగి ఫొటోలు
మార్ఫింగ్ చేసిన ఉద్యోగి
మహిళ ఫిర్యాదుతో అరెస్టు…
బెయిల్‌పై వచ్చి హార్డ్ డిస్క్
అపహరణ సస్పెండ్
అయినా రాజ్‌భవన్‌లోకి
ప్రవేశించిన నిందితుడు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయ డం సంచలనం సృష్టించింది. బాధితురా లు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫొటోలను గ తంలో రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేసిన శ్రీనివాస్ అనే ఉద్యోగి మార్ఫింగ్ చేశాడు. వా టిని బాధితురాలికి చూపించి నీ ఫొటొలు ఎవరో మార్ఫింగ్ చేసి తనకు పంపించారని చూపించాడు. కొన్ని ఫో టొలు తన కంప్యూటర్‌కు కూడా పంపించాడని చెప్పాడు, వాటిని చూసి షాక్ అయిన బాధితురాలు ఈ నెల 10వ తేదీన పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మార్ఫింగ్ ఫోటోలను శ్రీనివాస్ చేసినట్లు గుర్తించి 12వ తేదీన అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. మా ర్ఫింగ్ ఫోటోలు చేసింది ఐటి ఉద్యోగి శ్రీనివాస్‌గా తేలడంతో రాజ్‌భవన్ అధికారులు సస్పెండ్ చేశారు.

కాగా శ్రీనివాస్ సస్పెన్షన్‌లో ఉండగానే సెక్యూరిటీ సిబ్బందికి తన వస్తువులు లోపల ఉన్నాయని చెప్పి రాజ్‌భవన్‌లోకి వెళ్లి, తన కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్‌ను తీసుకుని వెళ్లాడు. తర్వాత సిసి టివిల ఫుటేజ్‌ను పరిశీలించిన రాజ్‌భవన్ ఉద్యోగులు శ్రీనివాస్ మార్ఫింగ్‌కు సంబంధించిన ఫొటోలు ఉండడంతో వాటిని తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. వెంటనే రాజ్‌భవన్ ఐటి మేనేజర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 15వ తేదీన చోరీ కేసులో అరెస్టు చేశారు. నిందితుడి వ ద్ద నుంచి హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఎలాం టి ఫైళ్లు మాయం కాలేదని పంజాగుట్ట ఎసిపి మోహన్ కుమార్ తెలిపారు. రాజ్ భవన్‌లో పనిచేసే ఓ మహిళ తన ఫొటోలను ఐటీ  ఉద్యోగి శ్రీనివాస్ మార్పింగ్ చేసినట్లు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఈనెల 12న శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్‌ల కోసం శ్రీనివాస్ ఈ నెల14వ తేదీన రాజ్ భవన్‌కు వచ్చాడని హెల్మెట్ ధరించి హార్డ్ డిస్క్‌లను దొంగలించాడని తెలిపారు. రాజ్ భవన్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు, ఫైల్స్ చోరీ జరగలేదని, రాజ్ భవన్‌లో బయట వ్యక్తులు ప్రవేశించలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News