- Advertisement -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. బిహార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన స్విమ్మర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విబాగంలో తెలంగాణ క్రీడాకారిణి నిత్య సాగి ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సుహాస్ ప్రీతమ్ స్వర్ణం దక్కించుకున్నాడు. సుహాస్ 1:06.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం గెలుచుకున్నాడు. పురుషుల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్‌లే విభాగంలో తెలంగాణ స్విమ్మర్ వర్షిత్ ధూలిపూడి పసిడి పతకం సాధించాడు. విజేతలను తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేశ్ అభినందించారు.
- Advertisement -