Tuesday, August 12, 2025

చీకాగోలో తెలంగాణ విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: అమెరికాలోని చికాగోలో తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి ట్రక్కు ఢీకొనడంతో విద్యార్థిని ఘటనా స్థలంలో చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతం గండి మైసమ్మలో శ్రీను రావు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. శ్రీను పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23) ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్ళింది. చికాగోలో అద్దెకు రూమ్ తీసుకొని ఎంఎస్ చదువుతోంది. శ్రీజ రాత్రి భోజనం చేసిన నడుచుకుంటూ అపార్ట్ మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్ కి వెళ్తుండగా వెనకాల నుండి ట్రక్కు ఢీకొనడంతో ఆమె ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. స్థానికులు కేసు నమోదు చేసి న్యూయార్క్ లోని ఎంబిసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News