Friday, July 18, 2025

స్విమ్మింగ్‌లో రిత్వికకు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా జరిగిన జాతీయ సీనియర్ అక్వాటిక్స్ (స్విమ్మింగ్) ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు స్వర్ణం లభించింది. మహిళల 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ మిట్టపల్లి రిత్విక పసిడి పతకం సొంతం చేసుకుంది. రిత్విక 33.98 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం దక్కించుకుంది. మహిళల 1500 మీటర్ల ఫ్రిస్టయిల్ విభాగంలో తెలంగాణ స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రజతం గెలుచుకుంది. అంతేగాక మహిళల 800 మీటర్ల ఫ్రిస్టయిల్ విభాగంలో కూడా వ్రితికి రజతం దక్కింది. 400 మీటర్ల ఫ్రిస్టయిల్‌లో కూడా వ్రితికి పతకం లభించింది. ఈ విభాగంలో వ్రితి కాంస్యం సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News