Sunday, June 29, 2025

ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోనల్ 1లో 379 పోస్టులు, మల్టీ జోనల్ 2లో 228 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరగనుంది. మూడు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 10వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు టిజిఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి తెలిపింది. జులై 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.

అనంతరం ఒక రోజు అంటే జులై 19 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 46 ఏళ్ల లోపు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్‌సి,ఎస్‌టి, బిసి, ఇడబ్లూఎస్ కేటగిరీల వారీకి 5 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఇవ్వగా, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సిసి అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఇచ్చారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – https://mhsrb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని బోర్డు స్పష్టం చేఇసంది. దరఖాస్తు ఫీజు రూ.500 లు కాగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇడబ్యూఎస్, వికలాంగ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి వేతనం యుజిసి స్కేల్ ప్రకారం రూ.68,900 నుంచి -రూ.2,05,500 మధ్య ఉంటుంది.

18 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులు భర్తీ
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 18 నెలల్లో దాదాపు 8 వేలకుపైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 1,931 మల్టీపర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్, 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 732 ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా, మెరిట్ జాబితాలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. కాగా, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల నియామకాలకు చేపట్టేందుకు గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News