మహాలక్ష్మి సంబురాల్లో డిప్యూటీ
సిఎం భట్టి కోటి మంది మహిళలను
కోటీశ్వరులను చేయడమే మా
లక్షమని స్పష్టీకరణ మహిళలకు
వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని
ప్రకటన మహాలక్ష్మితో ఆర్‌టిసి
లాభాలబాట పట్టిందని వ్యాఖ్య
ఎంజిబిఎస్‌లో ఘనంగా 200 కోట్ల
మహిళల ఉచిత ప్రయాణాల
వేడుక పాల్గొన్న మంత్రులు
పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి
మన తెలంగాణ/గోషామహల్: రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మ హిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి, రూ. 6680 కోట్లు ఆదా చేసుకు న్నారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బుధవారం ఎంజీబీఎస్‌లో నిర్వహించిన కా ర్యక్రమంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి, రవా ణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రుల చేతుల మీదుగా పలువురు ప్రయాణీకులు, ఆర్టీసీ సిబ్బందిని ఘ నంగా సత్కరించారు. మహాలక్ష్మి పథకంతో టిజిఎస్ ఆర్టీసీకి రీయంబర్స్‌మెంట్‌కు రూ.6, 680 కోట్లకు సం బంధించిన చెక్కును డిప్యూటీ సిఎం ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్‌కు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలోని మహిళలు ప్లిల చదువుల కోసం, దేవాలయాల సందర్శన, నగరా ల్లో ఉద్యోగం వంటి పనుల కోసం ఆర్టీసీ సేవలను మహాలక్ష్మి పథకం ద్వారా ఉపయోగించుకుని, ఆర్థికంగా ప్రయోజనం పొందారని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. ఆర్టీసీ మునిగిపోయే పడవ అని, ఆ రోజు అన్నారని, ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి నిలదొక్కుకుం టుందని డిప్యూటీ సిఎం వివరించారు. 200 కోట్ల ప్రయాణాలకు అయిన ఖర్చు రూ.6,680 కోట్ల ఆడబిడ్డల పక్షాన ఆర్టీసీకి రా ష్ట్ర ప్రభుత్వమే ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. భవిష్యత్‌లోనూ ఆడబిడ్డల ఆర్టీసీ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆర్టీసీలో రవా ణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కొత్త విధానాలు తీసుకు వస్తుండటంతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత ఆర్టీసీ 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గతంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం కాగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆక్యుపెన్సీ రేషియా 97 శాతానికి పెరిగిందన్నారు. మహాలక్ష్మిపథకానికి ముందు ఆర్టీసీలో 45 లక్షల మంది ప్రయాణిస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 65 లక్షలకు చేరిందని తెలిపారు.
రాష్ట్ర రాజధానిని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు డీజిల్ బస్సులను నగరం బయటకు దశల వారీగా తరలిస్తుండటంతో పాటు నగరంలో గల 11 శాతం బ్యాటరీ బస్సులను జత చేయడం జరిగిం దని, ఇప్పటికే 3వేల బ్యాటరీ బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు డిప్యూటీ సిఎం వివరించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు వారికి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, ఆ బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇప్పించి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బస్సుల అద్దె లకు సంబంధించి కోటి రూపాయల నగదును తన ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించారని వివరిం చారు. ప్రతీ యేటా 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నట్లు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విఖ్రమార్క తెలిపారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం లక్షానికి మించి 21, 650 వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలను అందించినట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి సంబరాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
త్వరలో నగరంలోని స్వయం సహాయక సం ఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పండుగను హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్కల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం. ప్రస్తుత రహదారుల మరమ్మత్తు పనులు, విస్తరణ కార్యక్రమాలు రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోతున్నట్లు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రోడ్ల నిర్మాణం ద్వారా ఆర్టీసీలో సురక్షిత ప్రయాణ సౌకర్యం కలుగుతుందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్ఫెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, టీజీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మెన్, ఎండి వి సి సజ్జన్నార్, జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులతో పాటు ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లు, ఆర్డీసీ డ్రైవర్, కండక్టర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.