Thursday, August 21, 2025

ప్రారంభమైన తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన రాష్ట్ర శాసనసభ ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత రాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ను ఎన్నుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈరోజు ఉదయం రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.

స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ నోటిఫికేషన్ కు నామినేషన్ వేయనున్నారు. ఏకగ్రీవంగా ఆయనను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News