Wednesday, September 17, 2025

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ.. ఎన్డీయేలోకి తెలుగుదేశం?

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమావేశంలో చర్చించారు. ఎపి, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఏన్డీయే భేటీకి తెలుగుదేశ పార్టీ హాజరయ్య అవకాశముంది. ఎపి అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని టిడిపి భావిస్తోంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీలకు అవగాహన కుదిరింది. సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ప్రతిష్టంభన లేదని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News