Friday, May 9, 2025

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం..

- Advertisement -
- Advertisement -

నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ సైన్యం వచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ లో విధుల్లో ఉన్న తెలుగు జవాన్ మురళీనాయక్‌.. పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. ఆయన వీర మరణం పొందిన ఈ విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు మురళీనాయక్ కుటుంబానికి సమాచారం అందించారు.

కుమారుడి మరణవార్త విని గుండెలవిసేలా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. జవాన్ మురళీనాయక్ మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎపి సిఎం చంద్రబాబు మురళీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని ఫోన్ లో పరామర్శించిన సిఎం.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News