Saturday, July 26, 2025

శుక్రవారం రాశి ఫలాలు (25-07-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు. వ్యాపార ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు.

వృషభం – కోపం, చికాకు, అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు, విలువైన పత్రాల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు వహించవలసిన సమయం.

మిథునం – తేలికగా సులువుగా పూర్తి అవుతాయి అనుకున్న పనులు తప్ప, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. శ్రమ పెరుగుతుంది.

కర్కాటకం – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్దిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి ఉండవు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య – ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

తుల – సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది.ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు.

వృశ్చికం – ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ధనుస్సు – శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు.

మకరం – ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తిచేస్తారు. ఆలోచనలు అధికమవడం వత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వద్దు.

కుంభం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి.

మీనం – ఆరోగ్యపరమైన చిక్కులు తప్పకపోవచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార సంబంధిత కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సానుకూల పడతాయి.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News